సీఎం జగన్ మేలు మరువలేనిది...: ఉక్రెయిన్ నుండి విజయవాడ చేరిన యువతి
విజయవాడ: రష్యా దాడులతో అట్టుకుడుతున్న ఉక్రెయిన్ నుండి భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేర్చడంకోసం భారత ప్రభుత్వం ఆపరేషన్ గంగ చేపట్టిన విషయం తెలిసిందే.
విజయవాడ: రష్యా దాడులతో అట్టుకుడుతున్న ఉక్రెయిన్ నుండి భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేర్చడంకోసం భారత ప్రభుత్వం ఆపరేషన్ గంగ చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఉక్రెయిన్ సరిహద్దు దేశాల గుండా ఇప్పటికే వేలాదిమందిని ఇండియాకు చేర్చింది కేంద్రం. ఇలా ఇండియాకు చేరుకున్న వారిలో చాలామంది తెలుగువారు కూడా వున్నారు. ఇలా ఉక్రెయిన్ నుంచి విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని మొగల్రాజపురం కు చేరుకుంది తెలుగు విద్యార్థిని లామ్ కమల రాణి.
ఉక్రెయిన్ నుండి విజయవాడ చేరుకోవటానికి సీఎం జగన్ చేసిన మేలు జీవితంలో మరువలేనిదని కమలరాణి పేర్కొన్నారు. ప్రధాని మోడీ చొరవతో ఢిల్లీ చేరుకున్నామని...అక్కడ నుంచి జగన్ సహాయం వలన ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలతో ఇంటికి చేరుకున్నానని ఆమె తెలిపారు. ఢిల్లీకి చేరుకున్నాక ఆంధ్రా భవన్లో తమకు వి.ఐ.పి సౌకర్యాలు కల్పించి కంటికిరెప్పల చూసుకున్నారని తెలిపారు.
ఇందుకుగాను తెలుగు విద్యార్థులందరి తరపున సీఎం జగన్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానని కమల రాణి పేర్కొన్నారు.