మురికి కాలువల కోసం ఆందోళన... రోడ్డెక్కిన గన్నవరం ప్రజలు
గన్నవరం : డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలంటూ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామస్తులు రోడ్డెక్కారు.
గన్నవరం : డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలంటూ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామస్తులు రోడ్డెక్కారు. గ్రామం మీదుగా వెళ్లే ప్రధాన రహదారిపై ముళ్ళకంచెలు వేసి ఆందోళనకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. తెలప్రోలు గ్రామంలో డ్రైనేజి వ్యవస్థ సరిగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. వర్షాకాలం మురికి నీరు ఇళ్లలోకి చేరుతోందని.. దీంతో రోగాల బారిన పడుతున్నట్లు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేసారు. ఎన్నిసార్లు చెప్పినా పంచాయితీ అధికారులు పట్టించుకోకపోవడంతో ఇలా రోడ్డుపైకి రావాల్సి వచ్చిందని గ్రామస్తులు తెలిపారు.