సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం చేసుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై

విశాఖపట్నం: సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవం వైభవంగా జరిగింది. 

First Published May 3, 2022, 3:11 PM IST | Last Updated May 3, 2022, 3:11 PM IST

విశాఖపట్నం: సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం కోసం సామాన్య భక్తులతో పాటు వీఐపిలు ఆలయానికి చేరుకున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడడుతూ... వరాహ నరసింహస్వామి నిజరూప దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.  ప్రజలందరూ బాగుండాలని... కరోనా అంతమవ్వాలని స్వామివారిని కోరుకున్నానని గవర్నర్ తమిళిసై అన్నారు.