ఏలూరు వింత వ్యాధి... టిడిపి త్రిసభ్య కమిటి సూచనలివే

ఏలూరులో వింత వ్యాధి పలువురిని ఆస్పత్రిపాలు చేసిన విషయం తెలిసిందే.
 

First Published Dec 13, 2020, 3:15 PM IST | Last Updated Dec 13, 2020, 3:15 PM IST

ఏలూరులో వింత వ్యాధి పలువురిని ఆస్పత్రిపాలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాధి కొందరి ప్రాణాలను బలితీసుకుంది. అయితే ఈ వింత వ్యాధి సోకడానికి గల కారణాలను మాత్రం ఇప్పటివరకు గుర్తించలేకపోయారు. కానీ టిడిపి మాత్రం నగరంలో సరఫరా చేస్తున్న నీరు కాలుష్యం కారణంగానే ప్రజలు అస్వస్థతకు గురవుతున్నట్లు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ త్రిసభ్య కమిటీ సభ్యులు ఏలూరులో పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఇవాళ(ఆదివారం) పర్యటించారు.  కమిటీ సభ్యులు మాజీ హోంమంత్రి చిజరాజప్ప, ఎమ్మెల్సీలు రాజేంద్రప్రసాద్, అశోక్‍బాబులతో పాటు స్థానిక టీడీపీ నాయకుల నగరంలో పర్యటించారు. మొదట ఆస్పత్రిలో వింత వ్యాధి బాధితులను పరామర్శించారు కమిటీ సభ్యులు.