టిడిపి అధికారంలోకి వచ్చిన 100రోజుల్లోనే మీకు శుభవార్త...: మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తాడేపల్లి: తమ గ్రామాల పరిధిలో వ్యవసాయ భూములను U1 జోన్ లో చేర్చడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని... వెంటనే దీన్ని ఎత్తివేయాలంటూ గతకొద్ది రోజులుగా తాడేపల్లి, కొలనుకొండ, కుంచనపల్లి రైతులు నిరసన చేపట్టారు.
తాడేపల్లి: తమ గ్రామాల పరిధిలో వ్యవసాయ భూములను U1 జోన్ లో చేర్చడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని... వెంటనే దీన్ని ఎత్తివేయాలంటూ గతకొద్ది రోజులుగా తాడేపల్లి, కొలనుకొండ, కుంచనపల్లి రైతులు నిరసన చేపట్టారు. ఇందులోభాగంగా బాధిత రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు తెలుగుదేశం పార్టీకి చెందిన రైతుసంఘాలు మద్దతు తెలిపాయి. రైతులతో కలిసి దీక్షలో కూర్చున్న రాష్ట్ర తెలుగుదేశం రైతుసంఘాల అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లో U1 జోన్ లోని భూములపై ఆంక్షలు ఎత్తివేస్తామన్నారు.
గతంలో ప్రభుత్వ అవసరాల మేరకు ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం కొన్ని ప్రాంతాలలో రిజర్వ్ జోన్ లు ఏర్పాటు చేసిందని... వీటిని తొలగించటం ప్రభుత్వానికి పెద్ద పనేమీ కాదన్నారు. ఇప్పటకే U1 జోన్ పై టిడిపి అధినాయకులతో చర్చించానని... వారి హమీ మేరకే టిడిపి అధికారంలోకి వచ్చిన 100 రోజులలో రిజర్వ్ జోన్ తొలగిస్తామని ప్రకటిస్తున్నానని మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు.