టిడిపి శ్రేణుల్లో ఉత్సాహం... గుంటూరులో చంద్రబాబుకు ఘన స్వాగతం

అమరావతి: సంగం డెయిరీ ఛైర్మన్‌, టిడిపి మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ను పరామర్శించడానికి గుంటూరు జిల్లాకు విచ్చేసిన టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. 

First Published Jul 13, 2021, 3:14 PM IST | Last Updated Jul 13, 2021, 3:14 PM IST

అమరావతి: సంగం డెయిరీ ఛైర్మన్‌, టిడిపి మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ను పరామర్శించడానికి గుంటూరు జిల్లాకు విచ్చేసిన టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. బుడంపాడు జాతీయ రహదారి వద్ద టీడీపీ ఇన్ చార్జ్ కోవెలమూడి రవీంద్ర, టీడీపీ నేతల ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చిన టిడిపి శ్రేణులు చంద్రబాబుకు స్వాగతం పలికారు. చంద్రబాబుతో పాటు టిడిపికి అనుకూలంగా నినాదాలతో హోరెత్తించారు. ఇలా భారీగా పార్టీశ్రేణులు వెంటరాగా పొన్నూరు మండలం చింతలపూడిలోని ధూళిపాళ్ల నరేంద్ర ఇంటికి చేరుకుని పరామర్శించారు. అనంతరం తిరిగి గుంటూరు మీదుగా వెళుతూ ఇటీవల మరణించిన మైనారిటీ నేత హిదాయత్ కుటుంబాన్ని కూడా పరామర్శించనున్నారు.