Asianet News TeluguAsianet News Telugu

దళితులపై మెరుగు నాగార్జున విమర్శలు.. మండిపడ్డ తెలుగు తమ్ముళ్లు, నిరసనలు..

కృష్ణా జిల్లా : గన్నవరం టిడిపి కార్యాలయం వద్ద టిడిపి నాయకులు ఆందోళన చేపట్టారు. 

First Published Sep 16, 2022, 2:03 PM IST | Last Updated Sep 16, 2022, 2:05 PM IST

కృష్ణా జిల్లా : గన్నవరం టిడిపి కార్యాలయం వద్ద టిడిపి నాయకులు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులకు టి.డి.పి నాయకులు మధ్య తోపులాట జరిగింది. మెరుగు నాగార్జున దళితులపై చేసిన విమర్శలకు నిరసనగా టి.డి.పి కార్యాలయం నుండి జాతీయ రహదారిపైకి వస్తున్న సమయంలో పోలీసులకు టి.డి.పి నాయకులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దళిత ద్రోహి నాగార్జున అంటూ టి.డి.పి నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. మెరుగు నాగార్జున దిష్టి బొమ్మ దగ్దం చేశారు. సి.ఎం డౌన్ డౌన్ , తుక్లక్ సి.ఎం అంటూ నినాదాలు చేశారు.