Asianet News TeluguAsianet News Telugu

బాదుడే బాదుడు : ధరల పెరుగుదలపై తెలుగుదేశం వినూత్న నిరసన...

అమరావతి : ఏపీ అసెంబ్లీ సమావేశాల రెండో రోజు కూడా టీడీపీ నిరసనలు చేపట్టింది.

First Published Sep 16, 2022, 1:37 PM IST | Last Updated Sep 16, 2022, 1:37 PM IST

అమరావతి : ఏపీ అసెంబ్లీ సమావేశాల రెండో రోజు కూడా టీడీపీ నిరసనలు చేపట్టింది. ధరల బాదుడే బాదుడు అంటూ నారా లోకేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం ప్రజా ప్రతినిధుల నిరసన ర్యాలీ నిర్వహింది. ప్రజలపై నిత్యావసరాల ధరల బాదుడు తగ్గించేలా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ నిరసన చేశారు. ధరలు దిగిరావాలి అంటే జగన్ దిగిపోవాలంటూ తెలుగుదేశం నినాదాలు చేస్తూ తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద  టిడిపి శాసనసభ పక్షం నిరసన చేసింది. ధరలు ఆకాశంలో... జగన్ ప్యాలస్ లో అంటూ నినాదాలు, చెత్త పై పన్నేసిన చెత్త సిఎం జగన్ అని ప్లకార్డుల ప్రదర్శన చేశారు. ధరల పెరుగుదలను నిరసిస్తూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి కాలినడకన వెళ్లారు.