Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్యే ఆళ్ళ అరెస్టుకు డిమాండ్... టిడిపి ఆందోళనతో మంగళగిరిలో ఉద్రిక్తత

మంగళగిరి : వైసిపి ఎమ్మెల్యే ఆళ్ళ రామక‌ృష్ణారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ గుంటూరు జిల్లా మంగళగిరిలో టిడిపి నాయకులు ఆందోళన చేపట్టారు.

First Published Apr 18, 2023, 1:29 PM IST | Last Updated Apr 18, 2023, 1:29 PM IST

మంగళగిరి : వైసిపి ఎమ్మెల్యే ఆళ్ళ రామక‌ృష్ణారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ గుంటూరు జిల్లా మంగళగిరిలో టిడిపి నాయకులు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే కనుసన్నల్లోనే తాడేపల్లి మండలం ఉండవల్లిలో  కొండలను అక్రమంగా తవ్వుతున్నారని... వెంటనే తవ్వకాలను నిలిపివేయాలంటూ టిడిపి ఆందోళనకు దిగింది. ఎలాంటి అనుమతులు లేకుండానే కొండను తవ్వుతున్నారంటూ టెంట్ వేసుకుని అక్కడే బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు టిడిపి నాయకులను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ వాహనంలో ఆందోళన చేపట్టినవారిని అక్కడినుండి తరలించి టెంట్ తొలగించారు. ఈ అరెస్టుల సమయంలో ఆందోళనకారులు, పోలీసులకు మద్య వాగ్వాదం జరిగింది.