Asianet News TeluguAsianet News Telugu

మైలవరంలో ఉద్రిక్తత... మాజీ మంత్రి దేవినేని ఉమ అరెస్ట్..

విజయవాడ : ప్రతిపక్ష టిడిపి ఆందోళనలతో ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

First Published Aug 28, 2023, 6:46 PM IST | Last Updated Aug 28, 2023, 6:46 PM IST

విజయవాడ : ప్రతిపక్ష టిడిపి ఆందోళనలతో ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏపీలో అధికార వైసీపీ ఇసుక దోపిడీకి పాల్పడుతోందని ఆరోపిస్తూ ఈ మూడురోజులు (28, 29, 30 తేదీల్లో) టిడిపి నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ మైలవరంలోని ఇసుక డంపింగ్ స్టాక్ పాయింట్ వద్ద మాజీ మంత్రి దేవినేని ఉమ నేతృత్వంలో టిడిపి నాయకులు నిరసన చేపట్టారు. టడిపి శ్రేణులను పోలీసులు అడ్డుకోడానికి ప్రయత్నించగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. టిడిపి నేతలు, పోలీసులకు మద్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా ఉమతో సహా టిడిపి నేతలను పోలీసులు అరెస్ట్ చేసారు.