కరెంట్ తీగలు కాదు బిల్లు పట్టుకున్నా షాక్ తప్పదు...: కంభంపాటి శిరీష సెటైర్లు
అమరావతి: కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ కొడుతుంది... కానీ దానికంటే ఎక్కువగా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం పెంచిన కరెంట్ బిల్లులు పట్టుకుంటే షాక్ కొట్టేలా వుందని టీడీపీ అధికార ప్రతినిధి కంభంపాటి శిరీష అన్నారు. పేదల నడ్డివిరిచేలా పెంచిన విద్యుత్ బిల్లులను వెంటనే తగ్గించకపోతే టిడిపి ఆధ్వర్యంలో ఉద్యమం ఉదృతం చేస్తామని శిరీష స్పష్టం చేసారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడిలోని విద్యుత్ భవనం ఎదుట టిడిపి శ్రేణులు నిరసన చేపట్టాయి. జగన్ రెడ్డి పరిపాలనలో విద్యుత్ బాదుడే బాదుడు అంటూ నినదిస్తూ నిరసన గళం వినిపించారు.