నారా లోకేష్ ఇలాకాలో టిడిపి దూకుడు...ఉద్రిక్తతల మధ్యే అన్న క్యాంటిన్ ప్రారంభం

మంగళగిరి: తీవ్ర ఉద్రిక్తత మధ్య ఎట్టకేలకు గుంటూరు జిల్లా మంగళగిరి అన్న క్యాంటీన్ ప్రారంభమయ్యింది.

First Published Jun 10, 2022, 2:35 PM IST | Last Updated Jun 10, 2022, 2:35 PM IST

మంగళగిరి: తీవ్ర ఉద్రిక్తత మధ్య ఎట్టకేలకు గుంటూరు జిల్లా మంగళగిరి అన్న క్యాంటీన్ ప్రారంభమయ్యింది.  నిన్న (గురువారం)మంగళగిరిలోని ఎన్టీఆర్ విగ్రహం దగ్గర టీడీపీ ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ని అనుమతులు లేవంటూ మున్సిపల్ సిబ్బంది తొలగించారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో అన్న క్యాంటిన్ ఏర్పాటుచేసి పేదలకు రూ.2 భోజనం పెట్టడానికి టిడిపి నేత నారా లోకేష్, స్థానిక నాయకులు సిద్దపడ్డారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు భారీగా మొహరించారు. చివరకు మున్సిపల్ సిబ్బంది, పోలీసుల అడ్డంకులను చేధించుకుని టిడిపి నాయకులు అన్న క్యాంటిన్ ప్రారంభించారు. పేదలకు కేవలం 2 రూపాయలకే భోజనం అందించి ఆకలిని తీర్చారు. చిరు వ్యాపారులు, మహిళలు ఈ అన్న క్యాంటిన్లోనే భోజనం చేసారు.