ఆయనకందరూ బంట్రోతుల్లా పనిచేయాలి.. బాబాయి అంటే పగ, కక్ష.. రామ్మోహన్‌నాయుడు
మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై ఎంపీ రామ్మోహన్‌నాయుడు జగన్ మీద విరుచుపడ్డారు.
మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై ఎంపీ రామ్మోహన్‌నాయుడు జగన్ మీద విరుచుపడ్డారు. జగన్ ను అసెంబ్లీలో గట్టిగా నిలదీసేది బాబాయేనని, అందుకే ఆయనమీద కక్ష సాధిస్తున్నాడని దుయ్యబట్టారు. జగన్ కందరూ బంట్రోతుల్లా పనిచేయాలని, సలాం కొట్టాలని అన్నారు. టీడీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే, మాజీ మంత్రిని అరెస్టు చేసేటప్పుడు కనీస చట్టబద్ధంగా వ్యహరించడమైనా చేతకాదా అని మండిపడ్డారు. బీసీ నేతలకిచ్చే గౌరవం ఇదేనా.. అసలు అచ్చెన్నాయుడిని అరెస్టు చేసింది? ఏసీబీనా? లేదంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గూండాలా అంటూ ప్రశ్నించారు.