నడిరోడ్డుపై టిడిపి పంచాయితీ...ఎంపీ కేశినేనితో బుద్దా వర్గం వాగ్వాదం

విజయవాడ వన్ టౌన్ నాలుగు స్తంభాల సెంటర్లో ఎంపీ కేశినేని నానికి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వర్గీయులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.  

First Published Feb 18, 2021, 1:25 PM IST | Last Updated Feb 18, 2021, 1:25 PM IST

విజయవాడ వన్ టౌన్ నాలుగు స్తంభాల సెంటర్లో ఎంపీ కేశినేని నానికి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వర్గీయులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.  డివిజన్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చిన ఎంపీ కేశినేనిని బుద్దా వర్గం అడ్డుకుంది. పార్టీ మారిన వాళ్ళని  టీడీపీలో  ఎలా ప్రోత్సహిస్తారని ఎంపీ నానిని ప్రశ్నించిన బుద్దా వర్గీయులు.అయితే తాను తప్పు చేస్తే పార్టీ క్రమ శిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుందన్నారు ఎంపీ నాని. పార్టీలో ఎవడు తప్పు చేసినా వారిపై చంద్రబాబుకు పిర్యాదు చేయవచ్చని వారికి సూచించారు. నడిరోడ్డుపై అడ్డుకొని వాగ్వాదం చేస్తే పార్టీకే నష్టమని బుద్దా వర్గీయులకు సర్దిచెప్పారు నాని.