టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ అరెస్ట్... పలాసలో హై టెన్షన్

శ్రీకాకుళం జిల్లా పలాసలో హై టెన్షన్ కొనసాగుతోంది.

First Published Aug 21, 2022, 1:23 PM IST | Last Updated Aug 21, 2022, 1:23 PM IST

శ్రీకాకుళం జిల్లా పలాసలో హై టెన్షన్ కొనసాగుతోంది. పలాసలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా బయటివారిని పట్టణంలోకి అనుమతించడం లేదు. అయితే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పలాస వెళ్లడానికి సిద్దమయ్యారు. దీంతో లోకేష్ ను పట్టణంలోకి వెళ్లనివ్వకుండా శ్రీకాకుళం కొత్తరోడ్డు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పలాసకు వెళ్లడానికి అనుమతివ్వబోమన్న పోలీసులపై లోకేష్ విరుచుకుపడ్డారు. ఓ మాజీ మంత్రిని, ఎమ్మెల్సీని పట్టుకుని ఇలా మాట్లాడటం ఏమిటి... మీ మాటతీరు మార్చుకోండి అంటూ డిఎస్పీపై లోకేష్ సీరియస్ అయ్యారు. లోకేష్ తో పాటు టిడిపి శ్రేణులు కూడా పోలీసులతో వాగ్వాదానికి  దిగడంతో పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది.