కరోనా బాధితులకు అండగా... జోరువానలోనూ సైకిలెక్కిన టిడిపి ఎమ్మెల్యే
పాలకొల్లు: పైనుండి జోరున కురుస్తున్న వర్షం కరోనా బాధితులను ఆదుకోవాలన్న అతడి సంకల్పాన్ని అడ్డుకోలేకపోయింది.
పాలకొల్లు: పైనుండి జోరున కురుస్తున్న వర్షం కరోనా బాధితులను ఆదుకోవాలన్న అతడి సంకల్పాన్ని అడ్డుకోలేకపోయింది. అదే వర్షంలో సైకిల్ పై ప్రయాణిస్తూ ప్రజల ఆకలిబాధను తీర్చడానికి బయలుదేరారు టిడిపి పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. ఎంతకీ వర్షం తగ్గకపోవడంతో అదే జోరువానలో కోవిడ్ బాధితులకు ధైర్యం చెప్పి, నిత్యావసరాలు, పౌష్టికాహారం అందచేయడానికి కలగంపూడి గ్రామానికి బయలుదేరారు నిమ్మల.