Asianet News TeluguAsianet News Telugu

జిల్లాకేంద్రం కోసం డిమాండ్... హిందూపురంలో నందమూరి బాలకృష్ణ మౌన ప్రదర్శన

అనంతపురం: తాను ప్రాతినిద్యం వహిస్తున్న హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇవాళ మౌన ప్రదర్శన చేపట్టారు. 

అనంతపురం: తాను ప్రాతినిద్యం వహిస్తున్న హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇవాళ మౌన ప్రదర్శన చేపట్టారు. హిందూపురంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్దకు నల్లకండువా ధరించి చేరుకున్న బాలయ్య అంబేద్కర్ విగ్రహం వరకూ మౌన ప్రదర్శన నిర్వహించారు. బాలయ్యకు మద్దతుగా టిడిపి నాయకులు, కార్యకర్తలతో పాటు స్థానిక ప్రజలు భారీగా మౌన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ క్రమంలో హిందూపురం మొత్తం 'జై బాలయ్య.. జై జై బాలయ్య' నినాదాలు మార్మోగాయి.

Video Top Stories