జగన్ పులి కాదు పిల్లి ... ప్రధాని మోదీ వద్ద మియావ్ మియావ్ : లోకేష్ ఎద్దేవా
మంగళగిరి : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులి కాదు పిల్లి అని...
మంగళగిరి : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులి కాదు పిల్లి అని... అందుకే ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ వద్ద మియావ్ మియావ్ అన్నాడని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేసారు. ప్రధానిని సార్ సార్ సార్ అంటూ కేసులు మాఫీకి ప్రయత్నించాడే తప్ప జగన్ రాష్ట్రానికి సాధించిందేమీ లేదన్నారు. సీఎం తీరు ప్రధాని మోదీకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయ్యిందని లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి గ్రామంలో టిడిపి చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. గ్రామంలోని పొలకమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన లోకేష్ కాలినడకన గ్రామంలో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన టిడిపి కార్యకర్తలు, అనారోగ్యంతో బాధపడుతున్నవారి ఇంటికెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. చిన్నారులను సరదాగా, వృద్దులను ఆప్యాయంగా పలకరిస్తూ లోకేష్ గ్రామమంతా తిరిగారు.