మీరు రక్తపాతం చేసినా మేం అన్నదానమే చేస్తాం..: వైసిపికి కౌంటర్ గా టిడిపి ఆందోళన

పల్నాడు జిల్లా నరసరావుపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట టీడీపీ ఆందోళన చేపట్టింది. 

First Published Sep 1, 2022, 4:22 PM IST | Last Updated Sep 1, 2022, 4:22 PM IST

పల్నాడు జిల్లా నరసరావుపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట టీడీపీ ఆందోళన చేపట్టింది. నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి చదలవాడ అరవింద బాబు ఆధ్వర్యంలో తెల్ల రేషన్ కార్డుదారులందరికీ ఉచిత రేషన్ ఇవ్వాలంటూ ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేయడం లేదని... వెంటనే బియ్యం పంపిణీ చేపట్టాలంటూ ఈ ఆందోళన చేపట్టారు. ప్రజల ఆహార భద్రత హక్కులను కాలరాస్తూ వైసిపి ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోందని చదలవాడ ఆగ్రహం వ్యక్తం చేసారు.