Asianet News TeluguAsianet News Telugu

16నెలలు జైల్లో చిప్పకూడు తిన్నా జగన్ లో మార్పు రాలేదు.. అయ్యన్నపాత్రుడు

అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టుల మీద విశాఖపట్నం టీడీపి ఆఫీస్ లో నేతలు నిరసన చేపట్టారు.

అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టుల మీద విశాఖపట్నం టీడీపి ఆఫీస్ లో నేతలు నిరసన చేపట్టారు. జగన్ శాడిజంకొద్దీ అరెస్టులు చేపట్టాడని దుయ్యబట్టారు. జగన్ కు చంపేయాలంటే ఆనందం, దౌర్జన్యం చేయాలంటే ఆనందం అంటూ అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. బీసీ నాయకుడిని ఇష్టారాజ్యంగా అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. అసంబ్లీ లో మా సంఖ్య బలం చూసి మా పై విరుచుకు పడుతున్నారు. ఉన్మాద పాలన సాగుతుంది. బీసీ సమస్యపై పోరాడే వారిని టార్గెట్ చేస్తున్నారు.
 బీసీ రిజర్వేషన్లు 25 శాతం తగ్గించింది జగన్ కాదా సబ్ ప్లాన్ ఎక్కడ ఉంది అంటూ ప్రశ్నించారు.