నరసరావుపేట టిడిపి నేత హత్య... జగన్ కు ఆ ఎమ్మెల్యే ఇచ్చిన భర్త్ డే గిప్ట్ : అచ్చెన్న సంచలనం

పల్నాడు జిల్లా నరసరావుపేటలో దారుణం చోటుచేసుకుంది. పట్టణంలోని కర్ణాటక బ్యాంక్ వద్ద ఇద్దరు మైనారిటీ నేతలపై గుర్తుతెలియని దుండగులు అతి దారుణంగా కత్తులతో దాడిచేసారు.

First Published Dec 21, 2022, 11:33 AM IST | Last Updated Dec 21, 2022, 11:33 AM IST

పల్నాడు జిల్లా నరసరావుపేటలో దారుణం చోటుచేసుకుంది. పట్టణంలోని కర్ణాటక బ్యాంక్ వద్ద ఇద్దరు మైనారిటీ నేతలపై గుర్తుతెలియని దుండగులు అతి దారుణంగా కత్తులతో దాడిచేసారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే టిడిపి కార్యకర్తలు ఇబ్రహీం, రహమత్ అలీ బైక్ పై వెళుతుండగా అడ్డుకుని దుండగులు దాడిచేసారు. దీంతో ఇబ్రహీం అక్కడికక్కడే మృతిచెందగా అలీ తీవ్ర గాయాలపాలయ్యాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రక్తపుమడుగులో పడివున్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఈ దారుణ హత్యపై ఏపీ టిడిపి అధ్యక్షులు అచ్చెన్నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. మైనారిటీ నేతల హత్య జగన్ సైతాన్ పాలనకి పరాకాష్ట... ఇవి వైసీపీ సర్కారు స్పాన్సర్డ్ మర్డరే అని లోకేష్ పేర్కొన్నారు. ముగ్గురు ఉన్మాదులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేశ్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి లు పల్నాడును వల్లకాడు చేస్తున్నారని అచ్చెన్న మండిపడ్డారు. జగన్ రెడ్డికి పుట్టిన రోజు బహుమతిగా మైనారిటీ సోదరుని శవాన్ని గోపిరెడ్డి అందించారని అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేసారు.