Asianet News TeluguAsianet News Telugu

సాక్షి పరువునష్టం కేసు... విశాఖ కోర్టుకు నారా లోకేష్

విశాఖపట్నం: అధికార వైసిపి పార్టీకి అనుకూల పత్రికలో తనపై అసత్య ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారం చేసారంటూ మాజీ మంత్రి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విశాఖ జిల్లా కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తప్పుడు రాతలు రాసిన సాక్షినుండి పరువు నష్టం కింద రూ.75కోట్లు ఇప్పించాలంటూ లోకేష్ దావా వేసారు. ఈ కేసు ఇవాళ విచారణకు రానున్న నేపథ్యంలో స్వయంగా కోర్టుకు హాజరయ్యేందుకు లోకేష్ విశాఖకు చేరుకున్నారు. ఇలా విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న లోకేష్ టిఎన్ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ తో పాటుటీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. 
 
Video Top Stories