Asianet News TeluguAsianet News Telugu

టిడిపి కార్యాలయంపై దాడి కేసు... ఆ పోలీసులపై ప్రైవేట్ కేసులకు సిద్దమే..: వర్ల రామయ్య

గుంటూరు : తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంపై వైసిపి మూకలు దాడిచేసినా పోలీసులు వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు.

First Published Sep 18, 2022, 2:59 PM IST | Last Updated Sep 18, 2022, 2:59 PM IST

గుంటూరు : తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంపై వైసిపి మూకలు దాడిచేసినా పోలీసులు వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. గతేడాది అక్టోబర్ 19న అంటే దాడిజరిగి 11నెలలు గడుస్తున్న పోలీసులు కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని తెలిపారు. వెంటనే టిడిపి కార్యాలయంపై జరిగిన దాడిపై విచారణ జరిపి
చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి మరోసారి ఫిర్యాదు చేసారు వర్ల రామయ్య. టిడిపి కేంద్ర కార్యాలయంపై దాడి సమయంలో రికార్డయిన సిసి కెమెరా ఫుటేజిని ఇవ్వడానికి సిద్దంగా వున్నట్లు రామయ్య తెలిపారు.  అయినప్పటికి దర్యాప్తుకు పోలీసులు ఎందుకు ముందుకు రావట్లేదో తెలియడం లేదన్నారు. సీఎం జగన్, సజ్జల చెబితేనే దర్యాప్తునకు ముందుకొస్తారా? అని ప్రశ్నించారు. పోలీసుల తీరుపై అసహనం వ్యక్తంచేసిన వర్ల త్వరలోనే ప్రైవేట్ కేసులు వేయనున్నట్లు తెలిపారు.