Asianet News TeluguAsianet News Telugu

టీడీపీకి భారీ షాక్.. వైసీపీలో చేరిన శిద్దా రాఘవరావు

టీడీపికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ప్రకాశం జిల్లాలో టీడీపీ కీలకనేత, మాజీ శిద్ధా రాఘవరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

టీడీపికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ప్రకాశం జిల్లాలో టీడీపీ కీలకనేత, మాజీ శిద్ధా రాఘవరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి శిద్దా రాఘ‌వ‌రావు ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైఎస్సార్‌సీపీ చేరారు. శిద్దా రాఘ‌వ‌రావు, ఆయ‌న కుమారుడు ఇద్దరికీ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ పార్టీ కండువా కప్పి సాదరంగా వైసీపీలోకి ఆహ్వానించారు. టీడీపీలో కీలకనేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు పార్టీని వీడటం ప్రతిపక్షానికి నిజంగానే ఎదురుదెబ్బ.