కడప జిల్లాలో టిడిపి నేత కారు ధ్వంసం... ఇదే గతి నీకూ పడుతుందని స్ట్రాంగ్ వార్నింగ్
కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంతజిల్లా కడపలో దారుణం చోటుచేసుకుంది.
కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంతజిల్లా కడపలో దారుణం చోటుచేసుకుంది. కమలాపురం మండలం రామాపురంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు సాయినాథ్ శర్మ కారులు అర్దరాత్రి కొందరు గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసారు. అంతేకాదు రాజకీయాలు మానుకోకుంటే ఈ కారుకు పట్టిన గతే నీకు పడుతుందని హెచ్చరిస్తూ గోడపత్రాలు అంటించారు. ఈ ఘటనతో టిడిపి నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతూ ప్రభుత్వం, పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం సొంతజిల్లాలో శాంతిభద్రతల పరిస్థితి ఇలావుంటే ఇక రాష్ట్రంలో ఎలావుందో అర్థం చేసుకోవచ్చని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు.