రైతులకు అండగా... నివర్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో లోకేష్ పర్యటన
విజయవాడ: కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని కొత్త మాజేరు గ్రామంలో టిడిపి నాయకులు నారా లోకేష్ పర్యటిస్తున్నారు.
విజయవాడ: కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని కొత్త మాజేరు గ్రామంలో టిడిపి నాయకులు నారా లోకేష్ పర్యటిస్తున్నారు. నివర్ తుఫాను కారణంగా పాడయిపోయిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. తుఫాన్ ల వల్ల పూర్తిగా పంట దెబ్బతినడంతో ట్రాక్టర్ తో పంటను తొక్కించినట్లు రైతులు లోకేష్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. రంగు మారిన బియ్యం కొనుగోలు చెయ్యడం లేదంటూ రైతులు లోకేష్ కు తెలిపారు. మాజేరుకు వెళ్లే సమయంలో నిమ్మకూరు వద్ద రహదారిపై వెళ్తున్న రైతులను చూసి లోకేష్ ఆగారు. వారు తరలిస్తున్న పంటను కూడా పరిశీలించారు.