Asianet News TeluguAsianet News Telugu

400 రోజులు 4వేల కిలోమీటర్లు...పాదయాత్రపై నారా లోకేష్ కీలక ప్రకటన

గుంటూరు : ఆంధ్ర ప్రదేశ్ మొత్తాన్ని కాలినడకన చుట్టేసి తిరిగి టిడిపి అధికారంలోకి తీసుకువచ్చేందుకు నారా లోకేష్ సిద్దమయ్యారు.

First Published Nov 25, 2022, 2:58 PM IST | Last Updated Nov 25, 2022, 2:58 PM IST

గుంటూరు : ఆంధ్ర ప్రదేశ్ మొత్తాన్ని కాలినడకన చుట్టేసి తిరిగి టిడిపి అధికారంలోకి తీసుకువచ్చేందుకు నారా లోకేష్ సిద్దమయ్యారు. తాజాగా సొంత నియోజకవర్గం మంగళగిరిలో తన పాదయాత్రపై లోకేష్ క్లారిటీ ఇచ్చారు. వచ్చేఏడాది జనవరి 27 నుండి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టేందుకు శ్రీకారం చుట్టనున్నట్లు స్వయంగా లోకేష్ వెల్లడించారు. 

 గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రస్తుతం పర్యటిస్తున్న నారా లోకేష్ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసారు. వచ్చే ఏడాదంతా తాను రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేపట్టనున్నానని... 400 రోజుల్లో కేవలం నాలుగురోజులు మాత్రమే మంగళగిరిలో వుండనున్నానని అన్నారు. కాబట్టి ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గాన్ని టిడిపికి కంచుకోటగా మార్చానని... ఇకపై టిడిపి బాధ్యతను కార్యకర్తలే తీసుకోవాలని లోకేష్ సూచించారు. నన్ను ఓడించేందుకు జగన్మోహన్ రెడ్డి  అన్ని ఆయుధాలు వాడతాడు... వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొని నిలబడదామని అన్నారు. 
ఇక మంగళగిరిని మీరే కాపుకాయాలని టిడిపి కార్యకర్తలకు లోకేష్ సూచించారు.