Asianet News TeluguAsianet News Telugu

డాక్టర్ సుధాకర్ కేసు సిబిఐకి.. ఇది జగన్ కు చెంపపెట్టు.. జవహర్ హర్షం

May 23, 2020, 1:15 PM IST

డాక్టర్ సుధాకర్ అంశాన్ని హైకోర్టు సీబీఐకి అప్పగించడంపై మాజీమంత్రి కె ఎస్ జవహర్ హర్షం వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా కృష్ణాజిల్లా, గానుగపాడులోని తన స్వగృహంలో మిత్ర పక్షం ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జగన్ ప్రభుత్వం మెడలు వంచి హక్కులు కాపాడే 
విధంగా సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించటం శుభపరిణామం అన్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరకాలంగా దళిత నేతలు ఎవరూ మాట్లాడినా అక్రమకేసులు బనాయిస్తున్నారని, సుధాకర్ ని పిచ్చోడిగా ముద్రవేసి పశువును తీసుకెళ్లినట్లు నడిరోడ్డుపై పోలీసులు 
లాక్కెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు.