Asianet News TeluguAsianet News Telugu

దాడిశెట్టి రాజా... నీ నోటిని ఫినాయిల్ తో కడుక్కో: మాజీ మంత్రి జవహర్

 
గుంటూరు : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి నాయకుల మధ్య మాటలయుద్దం కొనసాగుతోంది.

First Published Sep 26, 2022, 5:11 PM IST | Last Updated Sep 26, 2022, 5:11 PM IST

 
గుంటూరు : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి నాయకుల మధ్య మాటలయుద్దం కొనసాగుతోంది. తాజాగా మాజీ సీఎం, టిడిపి వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) పై అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ మంత్రి దాడిశెట్టి రాజాపై మాజీ మంత్రి కేఎస్ జవహర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ తో పాటు ఆయన కుటుంబంపై అవాకులు చవాకులు పెలుతున్న రాజాకు ప్రజలే బుద్ది చెబుతారని హెచ్చరించారు. 

మహనీయుడు ఎన్టీఆర్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న మంత్రి రాజా ఫినాయిల్ తో ఆ నోటిని శుభ్రం చేసుకోవాలని జవహర్ సూచించారు. అసలు ఎన్టీఆర్ తో వైస్సార్ ను పోల్చడమేంటి?... ఎన్టీఆర్ కు వున్న ఔన్నత్యం రాజశేఖర్ రెడ్డికి లేదు అలాగే వైఎస్సార్ కు వున్న ఫ్యాక్షనిస్ట్ చరిత్ర ఎన్టీఆర్ కు లేదని పేర్కొన్నారు. దాడిశెట్టి రాజా ఒక అజ్ఞాని... పేకాట ఆడటం, ఆడించడం తప్ప అతడికేమీ తెలియదని జవహర్ మండిపడ్డారు.