Asianet News TeluguAsianet News Telugu

జగన్ రెడ్డి పరిపాలన తాలిబాన్ పాలనకంటే ఘోరం...: మాజీ మంత్రి జవహర్ ఫైర్

గుంంటూరు: రాష్ట్రంలో జగన్ రెడ్డి పరిపాలన తాలిబాన్ పాలన కన్నా ఘోరంగా సాగుతోందని మాజీ మంత్రి కెఎస్ జవహర్ మండిపడ్డారు. 

గుంంటూరు: రాష్ట్రంలో జగన్ రెడ్డి పరిపాలన తాలిబాన్ పాలన కన్నా ఘోరంగా సాగుతోందని మాజీ మంత్రి కెఎస్ జవహర్ మండిపడ్డారు. ఏదో దొంగ మాదిరిగా టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబును అర్ధరాత్రి అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది... ఇది చాలా అన్యాయమని అన్నారు. ప్రతీకారానికి ప్రతిరూపంగా జగన్ వ్యవహరిస్తున్నారు జవహర్ మండిపడ్డారు. అశోక్ బాబు ను బేషరతుగా విడుదల చేయకపోతే ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆందోళనకు దిగుతారని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ కూడా ఆయనను ఎలా కాపాడుకోవాలో అలాగే కాపాడుకుంటాం అని మాజీ మంత్రి జవహర్ పేర్కొన్నారు.