బిహార్ కంటే అధ్వాన్నంగా ఏపీ... వైసిపికి 175 కాదు 17సీట్లు కష్టమే: మాజీ మంత్రి కొండ్రు మురళి
విశాఖపట్నం : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిపై మాజీ మంత్రి, టిడిపి నేత కొండ్రు మురళి ఫైర్ అయ్యారు.
విశాఖపట్నం : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిపై మాజీ మంత్రి, టిడిపి నేత కొండ్రు మురళి ఫైర్ అయ్యారు. వైసిపి పాలనలో రాష్ట్రం బిహార్ కంటే అధ్వాన్నంగా తయారయ్యిందని... ఏపీ పేరు చెబితేనే పరిశ్రమలు భయపడిపోయి వెనక్కి వెళుతున్నాయని అన్నారు. ల్యాండ్, సాండ్, వైన్, మైన్ ఇలా ప్రతిదాంట్లో అవినీతి జరుగుతోందని... చివరకు రాబోయే రోజుల్లో జరిగే మద్యం అమ్మకాలను తాకట్టుపెట్టి అప్పులు తెచ్చుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఇలాంటి పాలనను ప్రజలెవ్వరూ కోరుకోరని... వచ్చే ఎన్నికల్లో వైసిపి కి 175 కాదుకదా 17 సీట్లు కూడా రావని కొండ్రు మురళి అన్నారు.
పాలనలో ఎంతో అనుభవం కలిగిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పాలిస్తేనే రాష్ట్రం అభివృద్ది పథంలోకి వెళుతుందన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు దేశాభివృద్ధి దృష్టిలో పెట్టుకుని సరయిన నిర్ణయాలు తీసుకున్నారని మురళి పేర్కొన్నారు.