Asianet News TeluguAsianet News Telugu

తాగి ఊగుతూ సోయిలేకుండా... స్థాయిని మరిచి మాట్లాడుతున్నావ్..: మంత్రి జోగిపై జవహర్ సీరియస్

గుంటూరు : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుతో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి నాయకుల మధ్య మాటలయుద్దం మొదలయ్యింది. 

First Published Sep 25, 2022, 12:19 PM IST | Last Updated Sep 25, 2022, 12:19 PM IST

గుంటూరు : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుతో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి నాయకుల మధ్య మాటలయుద్దం మొదలయ్యింది. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబును వెన్నుపోటుదారుడు... ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణను దద్దమ్మ అంటూ మంత్రి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి జవహర్ కౌంటరిచ్చారు. జోగి రమేష్ తన స్థాయిని మరిచి ఎన్టీఆర్ కుటుంబంపై అవాకులు, చవాకులు పేలుతున్నాడని... మద్యం తాగి సోయలేకుండా ఊగిపోతూ మాట్లాడే ఇలాంటివాళ్ల మాటలు లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని జవహర్ మండిపడ్డారు. 

పావురాల గుట్టలో శవం దొరక్క ముందే సంతకాలు ఎవరు సేకరించారో జోగి గుర్తించేసుకుంటే బావుంటుందని జవహర్ అన్నారు.  తండ్రి వైఎస్సార్ శవం ముక్కలు కూడా పోగేయకుండానే చిద్విలాసంతో ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు సేకరించింది ఈ జగన్మోహన్ రెడ్డేనని గుర్తిచేసుకుంటే మంచిదని మంత్రి జోగి రమేష్ కు జవహర్ కౌంటరిచ్చారు. 

Video Top Stories