వైసిపి ఎమ్మెల్యేకు సవాల్ విసిరిన ... జివి ఆంజనేయులు హౌస్ అరెస్ట్

గుంటూరు: వినుకొండలో టీడీపీ, వైసీపీ ల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. 

First Published May 28, 2021, 12:39 PM IST | Last Updated May 28, 2021, 12:39 PM IST

గుంటూరు: వినుకొండలో టీడీపీ, వైసీపీ ల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. కోటప్పకొండ వద్ద ప్రమాణం చేసేందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జీవీ ఆంజనేయులును పోలీసులు అడ్డుకొన్నారు. జీవీ ఆంజనేయులుకు చెందిన స్వచ్ఛంధ సంస్థకు ఎన్నారైల నుండి నిధులు వస్తున్నాయని వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపించారు. అయితే తాను నిర్వహిస్తున్న స్వచ్ఛంధ సంస్థకు ఎన్నారైల నుండి నిధులు వస్తున్న విషయమై నిరూపించాలని ఎమ్మెల్యేకు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సవాల్ విసిరారు. ఈ క్రమంలోనే ఎలాంటి ఉద్రిక్తలు చోటుచేసుకోకుండా అప్రమత్తమైన పోలీసులు జీవీ ఆంజనేయులుకు 149 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారు.