పొన్నూరు మున్సిపాలిటీ వద్ద ఉద్రిక్తత... గేటు వద్ద బైఠాయించి ధూళిపాళ్ల ఆందోళన
గుంటూరు : భారీగా సామాజిక పెన్షన్ తొలగించారంటూ ప్రతిపక్ష టిడిపి గుంటూరు జిల్లా పొన్నూరులో ఆందోళన చేపట్టింది.
గుంటూరు : భారీగా సామాజిక పెన్షన్ తొలగించారంటూ ప్రతిపక్ష టిడిపి గుంటూరు జిల్లా పొన్నూరులో ఆందోళన చేపట్టింది. మున్సిపాలిటీ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. పెన్షన్ల తొలగింపుపై మున్సిపల్ కమీషనర్ కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, మాజీ ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులపై ఆగ్రహం వ్యక్తంచేసిన నరేంద్ర టిడిపి నాయకులతో కలిసి గేటు వద్దే బైఠాయించి ఆందోళనకు దిగారు.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో నరేంద్రను కార్యాలయంలోకి వెళ్ళేందుకు పోలీసులు అనుమతించారు.