Asianet News TeluguAsianet News Telugu

అర్థరాత్రి అరెస్టయిన అశోక్ బాబు కోసం వెళితే... దేవినేని ఉమనూ అరెస్ట్ చేసిన పోలీసులు

విజయవాడ: ఏపీలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకుల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. 

విజయవాడ: ఏపీలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకుల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. గురువారం అర్ధరాత్రి ఎమ్మెల్సీ అశోక్ బాబును సీఐడి అరెస్ట్ చేయగా ఆయనను పరామర్శించేందుకు వెళ్ళిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావును కూడా పోలీసులు అరెస్ట్ చేసారు. సీఐడి కార్యాలయంలో అశోక్ బాబుపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ చిత్రహింసలకు గురిచేస్తున్నారని దేవినేని ఉమ ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆయనను పరామర్శించేందుకు టిడిపి శ్రేణులతో కలిసి అశోక్ బాబును కలుస్తానంటూ ఉమ సీఐడి కార్యాలయానికి వెళ్ళారు. దీంతో వీరిని కార్యాలయంలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేసి అక్కడినుండి తరలించారు.