Asianet News TeluguAsianet News Telugu

హనుమాన్ జంక్షన్ ఆలయంలో నగలు మాయం... మంత్రి వెల్లంపల్లిపై మాజీ మంత్రి సీరియస్

విజయవాడ: హనుమాన్ జంక్షన్ అభయాంజనేయ స్వామి నగలు మాయం కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేసారు. 

విజయవాడ: హనుమాన్ జంక్షన్ అభయాంజనేయ స్వామి నగలు మాయం కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేసారు. ఆంజనేయ స్వామి అనుగ్రహంతో జరుగుతున్న పాపాలన్నీ ఈరోజు బయటపడ్డాయని... ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు బాధ్యులపై చర్యలు తీసుకూంటామని చెప్పాల్సిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి దోచుకునే పనిలో చాలా బిజీగా ఉన్నారని ఎద్దేవా చేసారు. బూతులు తిట్టే పనిలో ఉన్న ఆయనకు దేవాదాయ శాఖపై పట్టులేదు-బాధ్యత లేదు అని దేవినేని ఉమ మండిపడ్డారు.