Asianet News TeluguAsianet News Telugu

స్వర్ణాంధ్రప్రదేశ్ ని అప్పుల ఆంధ్రప్రదేశ్, గంజాయి ఆంధ్రప్రదేశ్ గా జగన్ మార్చేశాడు : దేవినేని ఉమ

నారా చంద్రబాబు నాయుడు పాలనలో హరిత, స్వర్ణాంద్రప్రదేశ్ గా వెలుగొందిన రాష్ట్ర జగన్ రెడ్డి పాలనలో గంజాయి, అప్పులు ఆంధ్ర ప్రదేశ్ గా మారిందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేసారు. 

First Published Apr 6, 2023, 3:40 PM IST | Last Updated Apr 6, 2023, 3:40 PM IST

నారా చంద్రబాబు నాయుడు పాలనలో హరిత, స్వర్ణాంద్రప్రదేశ్ గా వెలుగొందిన రాష్ట్ర జగన్ రెడ్డి పాలనలో గంజాయి, అప్పులు ఆంధ్ర ప్రదేశ్ గా మారిందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేసారు. ఈ నాలుగేళ్ళ దుష్ట, రాక్షస పాలనలో జగన్ రెడ్డి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడని... అన్ని రంగాలు, వ్యవస్థలకు నిర్వీర్యం చేశాడని మాజీ మంత్రి ఆందోళన వ్యక్తం చేసారు.   రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ వర్గాల అణచివేతకు వైసిపి ప్రభుత్వం పూనుకుందని... ఆయా వర్గాలపై అక్రమ కేసులు బనాయింపు అందుకోసమేనని దేవినేని ఉమ అన్నారు. ముఖ్యంగా దళిత వర్గానికి చెందినవారు జగన్ పాలనతో తీవ్ర అణచివేతకు గురయ్యారని అన్నారు. ఇలా రాష్ట్ర ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ జగన్ రెడ్డి విధ్వంసానికి పాల్పడ్డాడని ఉమ ఆరోపించారు.