మాజీ ఎమ్మెల్యే చింతమనేని అరెస్ట్... పోలీసులకు లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్
దెందులూరు: తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు.
దెందులూరు: తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. బి. సింగవరం గ్రామంలో ఇరువర్గాల మధ్య వివాదంతో చింతమనేని సంబంధముందంటూ కేసు పెట్టిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ పై టిడిపి జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ సీరియస్ అయ్యారు.
''టిడిపి నేతల అక్రమ అరెస్టులు జగన్ రెడ్డి పిరికిపంద చర్యలకు నిదర్శనం. పంచాయతీ ఎన్నికల్లో వెంటాడుతున్న ఓటమి భయంతోనే టిడిపి నాయకులపై అక్రమ కేసులు బనాయించి లోపల వేస్తున్నారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. బి. సింగవరం గ్రామంలో ఇరువర్గాల మధ్య వివాదం జరిగిన సమయంలో అసలు అక్కడ లేని వ్యక్తి పై అక్రమ కేసు నమోదు చేసి అరెస్ట్ చెయ్యడం రాజారెడ్డి రాజ్యాంగానికి మాత్రమే చెల్లింది. తక్షణమే ప్రభాకర్ గారిని విడుదల చెయ్యాలి. వైకాపా యూనిఫామ్ వేసుకొని వారు చెప్పినట్టు ఆడుతున్న కొంతమంది పోలీసు అధికారులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు'' అని లోకేష్ హెచ్చరించారు.