Asianet News TeluguAsianet News Telugu

పోలీసుల మాటున కాదు... దమ్ముంటే విజయవాడ రా చూసుకుందాం: నానికి వెంకన్న సవాల్

విజయవాడ : వైసిపి ఎమ్మెల్యే కొడాలి నానికి ఓటమి భయం పట్టుకుందని... ఆ భయంతోనే టిడిపి నాయకులపై దాడులకు తెగపడుతున్నాడని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు.

First Published Dec 26, 2022, 3:03 PM IST | Last Updated Dec 26, 2022, 3:03 PM IST

విజయవాడ : వైసిపి ఎమ్మెల్యే కొడాలి నానికి ఓటమి భయం పట్టుకుందని... ఆ భయంతోనే టిడిపి నాయకులపై దాడులకు తెగపడుతున్నాడని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. గుడివాడలో పోలీసుల మాటున మాట్లాడటం కాదు... విజయవాడకు రా చూసుకుందాం అంటూ సవాల్ విసిరారు. మాయల పకీరులాగా గెడ్డం పెంచుకుని రౌడీలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. 
ఇప్పటికైనా నాని మారాలని... లేదంటే ప్రజలు నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని వెంకన్న హెచ్చరించారు. 

మహనీయుడు వంగవీటి రంగా పేరును వాడుకుని నాని రాజకీయ లబ్ది పొందాడని వెంకన్న అన్నారు. వంగవీటి రాధ వైసిపిలో ఉంటే నాని కంటే ఎదుగుతాడని కుట్రతో బయటకు పంపారన్నారు. 
ఇప్పుడు రాధకి పట్టిన శనిగ్రహనమే నాని అని వెంకన్న మండిపడ్డారు. రంగా వర్ధంతి చేయొద్దంటు హుకుం జారీ చేసే హక్కు కొడాలి నానికి లేదన్నారు బుద్దా వెంకన్న.