బ్రాహ్మణ కార్పోరేషన్ కు నిధులు, బ్రాహ్మణులకూ సంక్షేమ పథకాలు..: బోండా ఉమ నిరసన

విజయవాడ: వైసీపీ ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం చేస్తోందని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు ఆందోళన వ్యక్తం చేసారు.

First Published Mar 2, 2022, 2:00 PM IST | Last Updated Mar 2, 2022, 2:00 PM IST

విజయవాడ: వైసీపీ ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం చేస్తోందని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు ఆందోళన వ్యక్తం చేసారు. తక్షణమే బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులు విడుదల చేయాలని... అర్హులైన బ్రాహ్మణులందరికీ సంక్షేమ పథకాలు అందజేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ విజయవాడలో ఉమ నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ...బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా మల్లాది విష్ణు అసమర్థుడని మండిపడ్డారు. బ్రాహ్మణులకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. బ్రాహ్మణుల సమస్యలను ఇప్పటికీ జగన్ సర్కార్ పరిష్కరించకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని బోండా ఉమ హెచ్చరించారు