వైఎస్సార్పీపీ నాయకులు ఇప్పటికైనా కళ్లు తెరిచి... సరిగా పరిపాలన చేయండి.. భూమా అఖిలప్రియ
కర్నూల్ టీడీపీ నేత, మాజీమంత్రి అఖిల ప్రియ కరోనా విషయంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.
కర్నూల్ టీడీపీ నేత, మాజీమంత్రి అఖిల ప్రియ కరోనా విషయంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. వీరి వల్ల జిల్లాలో కేసులు పెరగడమే కాకుండా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. కరోన పై ప్రభుత్వానికే సీరియస్ నెస్ లేదు. ఇంక అధికారులకు ఎలా ఉంటుంది..చనిపోయిన వారిని పూడ్చకుండా కాల్చాలి అని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నాయి. కానీ ఏపీలో కరోన తో చనిపోయిన వారిని పూడ్చుతున్నారు. దీని వలన ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది..నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు, సిబ్బందిని సస్పెండ్ చేయాలి. కరోనా బారిన పడ్డ ఎంపీ కుటుంబ సబ్యులకు మా సానుభూతి ఉంటుంది..ఎంపీ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను..ఇప్పటికైనా వైసీపీ నేతలు కళ్ళు తెరచి ప్రజల ప్రాణాలు పోకుండా కాపాడి మంచి పాలన అందించాలి.