Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ ఫోన్ తో జగన్ కు ఉచ్చ... అంతుచూస్తానంటూ వార్నింగ్ : మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

విశాఖపట్నం : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

First Published Dec 13, 2022, 3:24 PM IST | Last Updated Dec 13, 2022, 3:24 PM IST

విశాఖపట్నం : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల వైసిపి ప్రభుత్వ సలహాదారు మళ్లీ  సమైక్యాంధ్ర అంటూ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారని... హైదరాబాద్ లో నీ అంతు తేలుస్తానని వార్నింగ్ ఇచ్చాడని మాజీ మంత్రి పేర్కొన్నారు. కేసీఆర్ ఫోన్ తో జగన్ ఉచ్చ పోసుకున్నాడని... ఇలాంటి పిరికిపందను పులి, సింహం అంటూ వైసిపి నాయకులు ప్రగల్భాలు పలుకుతారని అన్నారు. ప్రధాని మోదీ, కేసీఆర్ కు జగన్ భయపడిపోతాడని బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. కలెక్టర్ కార్యాలయం వద్ద సచివాలయ సిబ్బంది ధర్నా చేసే దౌర్భాగ్య పరిస్థితి ఈ  వైసిపి పాలనలో వచ్చిందని మాజీ మంత్రి ఆందోళన వ్యక్తం చేసారు. మాకు ఇదేమి ఖర్మ అని సచివాలయ ఉద్యోగులు అనుకుంటున్నారని అన్నారు. మిస్టర్ జగన్ రెడ్డి... నువ్వు అపాయింట్ చేసిన సచివాలయ ఉద్యోగులు నీ అధిక పన్నుల మీద ఆందోళన చేస్తున్నారు... నీకసలు సిగ్గుందా అని మండిపడ్డారు. చెత్త మీద పన్నేంట్రా చెత్త నా కొడకా, ఇంటి మీద పన్నేంటి పిచ్చి దొరా, బాత్రూం పన్నేంట్రా బాబు అంటూ బండారు సత్యనారాయణ మూర్తి విరుచుకుపడ్డారు.