కేంద్రం వాటా అధికారుల నుండి వసూలు... బిజెపి సర్కార్ నిర్ణయం హర్షణీయం: అయ్యన్నపాత్రుడు

విశాఖపట్నం:  ఉపాధి హామీ నిధులు వ్యయంపై స్పందిస్తూ వైసిపి ప్రభుత్వంపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్ర విమర్శలు చేసారు. 

First Published Oct 31, 2021, 1:26 PM IST | Last Updated Oct 31, 2021, 1:26 PM IST

విశాఖపట్నం:  ఉపాధి హామీ నిధులు వ్యయంపై స్పందిస్తూ వైసిపి ప్రభుత్వంపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్ర విమర్శలు చేసారు. ఉపాధి హామీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం  పక్కదారి పట్టించి పేదవాడి కడుపు కొడుతోందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల పట్టాలు ఇచ్చిన స్థలాల్లో గోతులు పూడ్చడానికి ఉపాధి హామీ నిధులను వినియోగించారని... ఇలా రెండు వేల కోట్ల నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు.  

దీనిపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడం శుభపరిణామమన్నారు. కేంద్ర వాటా నిధులను అధికారుల నుంచి వసూలు చేయాలంటూ ఆదేశించడం హర్షణీయమన్నారు. దీనిపై వెనకడుగు వేయకుండా కేంద్రం చర్యలు తీసుకునేలా రాష్ట్ర బిజెపి నాయకులు ఒత్తిడి తీసుకురావాలని అయ్యన్న సూచించారు.