ప్రతీ బేవార్స్ నా కొడుకూ ఇస్తాడా.. అయ్యన్నపాత్రుడు ఫైర్..
కరోనా నివారణ లో ముఖ్యమంత్రి అవగాహన లోపం వలన ప్రజలందరూ నవ్వుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉందని మాజీ మంత్రివర్యులు, అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు.
కరోనా నివారణ లో ముఖ్యమంత్రి అవగాహన లోపం వలన ప్రజలందరూ నవ్వుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉందని మాజీ మంత్రివర్యులు, అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. విపత్తు సమయంలో కేంద్రం ఇస్తున్న వెయ్యి రూపాయలను వైకాపా నాయకులు పంచి రాజకీయానికి వాడుకోవడం సరికాదు. ఎవరైనా చట్టానికి లోబడి పనిచేయాల్సిందేనన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగుల జీతాలలో కోత విధించకుండా కరోనా నివారణకు కుటుంబాలను వదులుకుని 24 గంటలు కష్టపడుతున్న డాక్టర్లుకు, పోలీసులకు, పారిశుధ్ధ్య కార్మికులకు అధనంగా ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు.