Asianet News TeluguAsianet News Telugu

అనంతపురం టిడిపిలో వర్గపోరు... పార్టీపెద్దల ముందే తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు

అనంతపురం : ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో వర్గవిబేధాలు భగ్గుమన్నాయి.

First Published Nov 10, 2022, 9:47 AM IST | Last Updated Nov 10, 2022, 9:47 AM IST

అనంతపురం : ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో వర్గవిబేధాలు భగ్గుమన్నాయి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జీ మధ్య కొనసాగుతున్న ఆదిపత్య పోరు తారాస్థాయికి చేరి ఇరువర్గాలు పార్టీపెద్దల ఎదుటే తన్నుకునే స్థాయికి చేరింది. కళ్యాణదుర్గం నియోజకవర్గ టిడిపి ఇంచార్జీగా ఉమామహేశ్వర నాయుడు కొనసాగుతున్నాడు. ఆయనకు మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరికి మధ్య ఆదిపత్య పోరు సాగుతోంది. ఈ క్రమంలోనే రాయలసీమ ఇంచార్జి అమర్నాథ్ రెడ్డి, అనంతపురం జిల్లా ఇంచార్జి బిటి నాయుడు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు కళ్యాణదుర్గం టిడిపి నాయకులు, కార్యకర్తలతో స్థానిక ఎంవైఆర్ కళ్యాణమండపంలో సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే ఉమామహేశ్వర నాయుడు, హనుమంతరాయ చౌదరి వాదోపవాదాలకు దిగడంతో వారి వర్గీయులు రెచ్చిపోయారు. ఓ వర్గంపై మరో వర్గం కుర్చీలు విసురుకుంటు దాడులకు దిగి రచ్చరచ్చ చేసారు. పార్టీ పెద్దలు సముదాయించే ప్రయత్నం చేసినా కార్యకర్తలు మాత్రం గొడవ ఆపకపోవడంతో సమావేశం రసాభాసగా మరింది.