Asianet News TeluguAsianet News Telugu

ఏపీ నుండి తెలంగాణ ఇసుక స్మగ్లింగా... ఖర్మ ఖర్మ..: టిడిపి మాజీ ఎమ్మెల్యే ఆందోళన

విజయవాడ : ఏపీ నుండి తెలంగాణకు వైసిపి నాయకులు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని ఆరోపిస్తూ ఎన్టీఆర్ జిల్లాలో టిడిపి నాయకులు ఆందోళన చేపట్టారు. 

First Published Jan 23, 2023, 11:39 AM IST | Last Updated Jan 23, 2023, 11:39 AM IST

విజయవాడ : ఏపీ నుండి తెలంగాణకు వైసిపి నాయకులు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని ఆరోపిస్తూ ఎన్టీఆర్ జిల్లాలో టిడిపి నాయకులు ఆందోళన చేపట్టారు. ఆదివారం అర్ధరాత్రి జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఆధ్వర్యంలో తెలంగాణకు ఇసుకను తరలిస్తున్న లారీలను అడ్డుకుని ఆందోళన చేపట్టారు. ఆదివారం అర్ధరాత్రి వత్సలాయి బోర్డర్ లో రోడ్డుపై బైఠాయించి మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, టిడిపి నాయకులు ఆందోళనకు దిగారు. వైసిపి నాయకులు రాష్ట్రంలో లభించే సహజ సంపదను పక్కరాష్ట్రానికి తరలిస్తున్నారని... అందువల్లే అధికారులు ఇసుక లారీలను చూసిచూడనట్లు వదిలేస్తున్నారని శ్రీరామ్ తాతయ్య ఆరోపించారు.