Asianet News TeluguAsianet News Telugu

టీడీపీకి మరో షాక్.. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్..

టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కొడుకు జేసీ అస్మిత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.

టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కొడుకు జేసీ అస్మిత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరిని హైదరాబాద్‌లోని వారి నివాసంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతపురానికి తరలిస్తున్నారు. 154 వాహనాలకు సంబంధించి ఫేక్ ఇన్సూరెన్స్ పత్రాల వ్యవహారంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కొడుకు జేసీ అస్మిత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరిని హైదరాబాద్‌లోని ఇంటిలో అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతపురానికి తరలిస్తున్నారు. బీఎస్-3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేసి అమ్మకాలు సాగించినట్టుగా వీరిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఆరా తీయగా నకిలీ పత్రాలు సృష్టించి 154 వాహనాలను నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్ చేసినట్టుగా తెలుస్తోంది. 

Video Top Stories