అదే అంబేద్కర్ కు అసలైన నివాళి.. చంద్రబాబు..
భారత రాజ్యాంగ రూపశిల్పి డా.బి ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు తన నివాసంలోనే అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఎవరికి వారు తమ ఇళ్ళలోనే అంబేద్కర్ జయంతిని జరుపుకోవాలని... దేశమంతా ఒక్కటిగా నిలిచి కరోనాను తరిమికొట్టడమే అంబేద్కర్ కు మనం అందించే అసలైన నివాళి అని చంద్రబాబు పిలుపునిచ్చారు.