విశాఖలో చంద్రబాబు ఘనస్వాగతం... టిడిపి శ్రేణుల కోలాహలంతో మారుమోగిన విమానాశ్రయం

విశాఖపట్నం: రెండురోజుల పర్యటన కోసం విశాఖపట్నంకు చేరుకున్న టిడిపి అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. 

First Published Jun 15, 2022, 5:05 PM IST | Last Updated Jun 15, 2022, 5:05 PM IST

విశాఖపట్నం: రెండురోజుల పర్యటన కోసం విశాఖపట్నంకు చేరుకున్న టిడిపి అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. విశాఖ విమానాశ్రయానికి భారీగా చేరుకున్న టిడిపి నాయకులు, కార్యకర్తలు చంద్రబాబుకు స్వాగతం పలికారు. మహిళా నాయకులు మంగళహారతులు పట్టారు. టిడిపి శ్రేణుల నినాదాలు, నాయకుల పలకరింపుల మధ్య చంద్రబాబు కాన్వాయ్ వద్దకు చేరుకున్నారు. కార్యకర్తల కోలాహలంతో విశాఖ విమానాశ్రయం మారుమోగింది. అందరికీ అబివాదం చేస్తూ అక్కడినుండి రోడ్డుమార్గంలో అనకాపల్లి జిల్లా చోడవరంలో జరిగే మినీ మహానాడు బయలుదేరారు చంద్రబాబు . చోడవరంలో కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన అనంతరం చంద్రబాబు రాత్రికి అనకాపల్లి చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేయనున్నారు.