Asianet News TeluguAsianet News Telugu

గవర్నర్ ను కలిసిన టీడీపీ, జనసేన నాయకులు.. అచ్చెన్నాయుడు కంటతడి...

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో సోమవారం రాష్ట్ర గవర్నర్ ను విశాఖపట్నం పోర్ట్ గెస్ట్ హౌస్ లో కలిసిన  రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెంనాయుడు కలిశారు. 

First Published Sep 11, 2023, 12:22 PM IST | Last Updated Sep 11, 2023, 12:22 PM IST

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో సోమవారం రాష్ట్ర గవర్నర్ ను విశాఖపట్నం పోర్ట్ గెస్ట్ హౌస్ లో కలిసిన  రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెంనాయుడు కలిశారు. అరెస్ట్ అన్యాయం అంటూ ఫిర్యాదు చేశారు. దీనిమీద గవర్నర్ కూడా సానుకూలంగా స్పందించారని ఆయన మీడియాతో తెలిపారు. జగన్ సైకోలా వ్యవహరిస్తూ.. కక్షపూరితంగానే ఈ అరెస్టుకు పాల్పడ్డారని మండిపడ్డారు. గవర్నర్ దీనిమీద స్పందిస్తూ.. రాష్టంలో జరుగుతున్న పరిస్థితి గమనిస్తున్నానన్నారని తెలిపారు. తనకు కూడా అరెస్టుకు సంబంధించిన సమాచారం తెలియదని అన్నారని అచ్చెన్నాయుడు తెలిపారు.